చతుఃషష్టి ఉపచారాలు
లలితా రహస్యనామ
సహస్రస్తోత్రంలో స్తుతించిన విధంగా
“చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |
మహా చతుష్షష్టి కోటి
యోగినీ గణసేవితా || 58 ||”
ఒకసారి
శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 కోట్ల యోగినీ దేవతలు చతుఃషష్టి
ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన
స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు.
అవి.
1.
అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి,
త్రాగుటకు జలము
సమర్పించడం
2.
అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3.
సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4.
మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5.
మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6.
దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7.
ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8.
కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి
తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9.
ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10.
అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11.
అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12.
ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి
అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13.
చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది
దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14.
కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం
వేయడం
15.
జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ
పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన
మాలతో అమ్మవారిని అలంకరించడం
16.
భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17.
మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ
మణిపీఠం పై కూర్చోపెట్టడము
18.
నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం
పెట్టడం
19.
దానిపైన చంద్ర శకలం పెట్టడం
20.
సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21.
తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22.
కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23.
పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24.
మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25.
నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26.
అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27.
ఆర్య భూషణం -
ప్రధాన భూషణం అలంకరించడము
28.
మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29.
హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30.
పతకం – బంగారు పతకం
31.
మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32.
ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33.
ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34.
చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35.
కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు
కేయీరములు ( దండ కడియాలు)
36.
వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37.
ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38.
కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే
ఆభరణము
39.
కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40.
సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం
(కుత్తిగంటు)
41.
పాదకటకం – కాలి
అందెలు
42.
రత్ననూపురములు –
దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43.
పాదంగుళీయములు -
మట్టెలు
44.
పాశం – పైన ఉన్న
కుడి చేతిలో తాడు
45.
అంకుశం – పైన ఉన్న
ఎడమ చేతిలో అంకుశం
46.
పుండ్రేక్షు చాపము –
క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47.
పుష్పబాణములు – కింద
ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48.
శ్రీ మణి మాణిక్య
పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49.
స్వ సామన వేషభి
ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన
మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50.
కామేశ్వరాంగ
పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51.
అమృతచషకము –
అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52.
ఆచమనీయము – జలమునందించుట
53.
కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం
అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54.
ఆనందోల్లాస విలాస
హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55.
మంగళార్తికం – దీపముల
గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56.
ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57.
చామరము –
అమ్మవారికి చామరము వీచుట
58.
దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59.
తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60.
చందనం – గంధం పమర్పించుట
61.
పుష్పం – పుష్పాలను సమర్పించుట
62.
ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63.
దీపము – దీప దర్శనము చేయించుట
64.
నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన
నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట.
ఏకాంతములొ 64 కళలతో కూడిన అమ్మవారిని
ధ్యానిస్తూ పైన చెప్పిన ఉపచారాలు మనమే చేస్తున్నట్లు భావనచేస్తూ పొందే ఆనందం
వర్ణనాతీతం, అనిర్వచనీయం. స్వానుభవపూర్వకంగా ఆనందించవలసిన విషయం. ఈ అనుగ్రహాన్ని
అందరికీ ప్రసాదించవలసిందిగా ఆ జగజ్జననిని కోరుతున్నాను.
॥ దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రమ్
॥
ఓం అథ శ్రీ
దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రమ్ ।
ఉషసి
మాగధమఙ్గలగాయనైః
ఝటితి జాగృహి
జాగృహి జాగృహి ।
అతికృపార్ద్రకటాక్షనిఱీక్షణైః
జగదిదం జగదమ్బ
సుఖీకురు ॥ ౧॥
కనకమయవితర్దిశోభమానం
దిశి దిశి
పూర్ణసువర్ణకుమ్భయుక్తమ్ ।
మణిమయమణ్టపమధ్యమేహి
మాతః
మయి కృపయాశు
సమర్చనం గ్రహీతుమ్ ॥ ౨॥
కనకకలశశోభమానశీర్షం
జలధరలమ్బి
సముల్లసత్పతాకమ్ ।
భగవతి తవ
సంనివాసహేతోః
మణిమయమన్దిరమేతదర్పయామి
॥ ౩॥
తపనీయమయీ
సుతూలికా
కమనీయా
మృదులోత్తరచ్ఛదా ।
నవరత్నవిభూషితా
మయా
శిబికేయం జగదమ్బ
తేఽర్పితా ॥ ౪॥
కనకమయవితర్దిస్థాపితే
తూలికాఢయే
వివిధకుసుమకీర్ణే
కోటిబాలార్కవర్ణే ।
భగవతి రమణీయే
రత్నసింహాసనేఽస్మిన్
ఉపవిశ పదయుగ్మం
హేమపీఠే నిధాయ ॥ ౫॥
మణిమౌక్తికనిర్మితం
మహాన్తం
కనకస్తమ్భచతుష్టయేన
యుక్తమ్ ।
కమనీయతమం భవాని
తుభ్యం
నవముల్లోచమహం
సమర్పయామి ॥ ౬॥
దూర్వయా సరసిజాన్వితవిష్ణు-
క్రాన్తయా చ
సహితం కుసుమాఢ్యమ్ ।
పద్మయుగ్మసదృశే
పదయుగ్మే
పాద్యమేతదురరీకురు
మాతః ॥ ౭॥
గన్ధపుష్పయవసర్షపదూర్వా-
సంయుతం
తిలకుశాక్షతమిశ్రమ్ ।
హేమపాత్రనిహితం
సహ రత్నైః
అధ్యర్మేతదురరీకురు
మాతః ॥ ౮॥
జలజద్యుతినా కరేణ
జాతీ-
ఫలతక్కోలలవఙ్గగన్ధయుక్తైః
।
అమృతైరమృతైరివాతిశీతైః
భగవత్యాచమనం
విధీయతామ్ ॥ ౯॥
నిహితం కనకస్య
సమ్పుటే
పిహితం
రత్నపిధానకేన యత్ ।
తదిదం జగదమ్బ
తేఽర్పితం
మధుపర్కం జనని
ప్రగృహ్యతామ్ ॥ ౧౦॥
ఏతచ్చమ్పకతైలమమ్బ
వివిధైః పుష్పైః ముహుర్వాసితం
న్యస్తం రత్నమయే
సువర్ణచషకే భృఙ్గైః భ్రమద్భిః వృతమ్ ।
సానన్దం
సురసున్దరీభిరభితో హస్తైః ధృతం తే మయా
కేశేషు
భ్రమరభ్రమేషు సకలేష్వఙ్గేషు చాలిప్యతే ॥ ౧౧॥
మాతః
కుఙ్కుమపఙ్కనిర్మితమిదం దేహే తవోద్వర్తనం
భక్త్యాహం కలయామి
హేమరజసా సమ్మిశ్రితం కేసరైః ।
కేశానామలకైః
విశోధ్య విశదాన్కస్తూరికోదఞ్చితైః
స్నానం తే నవరత్నకుమ్భసహితైః
సంవాసితోష్ణోదకైః ॥ ౧౨॥
దధిదుగ్ధఘృతైః
సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః ।
స్నపయామి
తవాహమాదరాజ్జనని త్వాం పునరుష్ణవారిభిః ॥ ౧౩॥
ఏలోశీరసువాసితైః
సకుసుమైర్గఙ్గాది తీర్థోదకైః
మాణిక్యామలమౌక్తికామృతరసైః
స్వచ్ఛైః సువర్ణోదకైః ।
మన్త్రాన్వైదికతాన్త్రికాన్పరిపఠన్సానన్దమత్యాదరాత్
స్నానం తే
పరికల్పయామి జనని స్నేహాత్త్వమఙ్గీకురు ॥ ౧౪॥
బాలార్కద్యుతి
దాడిమీయకుసుమప్రస్పర్ధి సర్వోత్తమం
మాతస్త్వం
పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితమ్ ।
ముక్తాభిః
గ్రథితం సుకఞ్చుకమిదం స్వీకృత్య పీతప్రభం
తప్తస్వర్ణసమానవర్ణమతులం
ప్రావర్ణమఙ్గీకురు ॥ ౧౫॥
నవరత్నమయే
మయార్పితే
కమనీయే
తపనీయపాదుకే ।
సవిలాసమిదం
పదద్వయం
కృపయా దేవి
తయోర్నిధీయతామ్ ॥ ౧౬॥
బహుభిరగరుధూపైః
సాదరం ధూపయిత్వా
భగవతి తవ
కేశాన్కఙ్కతైర్మార్జయిత్వా ।
సురభిభిరరవిన్దైశ్చమ్పకైశ్చార్చయిత్వా
ఝటితి కనకసూత్రైర్జూటయన్వేష్టయామి
॥ ౧౭॥
సౌవీరాఞ్జనమిదమమ్బ
చక్షుషోస్తే
విన్యస్తం
కనకశలాకయా మయా యత్ ।
తన్న్యూనం
మలినమపి త్వదక్షిసఙ్గాత్
బ్రహ్మేన్ద్రాద్యభిలషణీయతామియాయ
॥ ౧౮॥
మఞ్జీరే
పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాఞ్చీం కటౌ
ముక్తాహారమురోజయోరనుపమాం
నక్షత్రమాలాం గలే ।
కేయూరాణి భుజేషు
రత్నవలయశ్రేణీం కరేషు క్రమా-
త్తాటఙ్కే తవ
కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిమ్ ॥ ౧౯॥
ధమ్మిల్లే తవ
దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే
ముక్తారాజివిరాజమానతిలకం
నాసాపుటే మౌక్తికమ్ ।
మాతర్మౌక్తికజాలికాం
చ కుచయోః సర్వాఙ్గులీషూర్మికాః
కటయాం
కాఞ్చనకిఙ్కిణీర్వినిదధే రత్నావతంసం శ్రుతౌ ॥ ౨౦॥
మాతః ఫాలతలే
తవాతివిమలే కాశ్మీరకస్తూరికా-
కర్పూరాగరుభిః
కరోమి తిలకం దేహేఽఙ్గరాగం తతః ।
వక్షోజాదిషు
యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం
పాదౌ
చన్దనలేపనాదిభిరహం సమ్పూజయామి క్రమాత్ ॥ ౨౧॥
రత్నాక్షతైస్త్వాం
పరిపూజయామి
ముక్తాఫలైర్వా
రుచిరైరవిద్ధైః ।
అఖణ్డితైర్దేవి
యవాదిభిర్వా
కాశ్మీరపఙ్కాఙ్కితతణ్డులైర్వా
॥ ౨౨॥
జనని
చమ్పకతైలమిదం పురో
మృగమదోపయుతం
పటవాసకమ్ ।
సురభిగన్ధమిదం చ
చతుఃసమం
సపది సర్వమిదం
పరిగృహ్యతామ్ ॥ ౨౩॥
సీమన్తే తే భగవతి
మయా సాదరం న్యస్తమేతత్
సిన్దూరం మే
హృదయకమలే హర్షవర్షం తనోతి ।
బాలాదిత్యద్యుతిరివ
సదా లోహితా యస్య కాన్తీ-
రన్తర్ధ్వాన్తం
హరతి సకలం చేతసా చిన్తయైవ ॥ ౨౪॥
మన్దారకున్దకరవీరలవఙ్గపుష్పైః
త్వాం దేవి
సన్తతం అహం పరిపూజయామి ।
జాతీజపావకులచమ్పకకేతకాది-
నానావిధాని
కుసుమాని చ తేఽర్పయామి ॥ ౨౫॥
మాలతీవకులహేమపుష్పికా-
కాఞ్చనారకరవీరకైతకైః
।
కర్ణికారగిరికర్ణికాదిభిః
పూజయామి జగదమ్బ
తే వపుః ॥ ౨౬॥
పారిజాతశతపత్రపాటలైః
మల్లికావకులచమ్పకాదిభిః
।
అమ్బుజైః
సుకుసుమైశ్చ సాదరం
పూజయామి జగదమ్బ
తే వపుః ॥ ౨౭॥
లాక్షాసమ్మిలితైః
సితాభ్రసహితైః శ్రీవాససమ్మిశ్రితైః
కర్పూరాకలితైః
శిరైర్మధుయుతైర్గోసర్పిషా లోడితైః ।
శ్రీఖణ్డాగరుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్తుభిః
ధూపం తే
పరికల్పయామి జనని స్నేహాత్త్వమఙ్గీకురు ॥ ౨౮॥
రత్నాలఙ్కృతహేమపాత్రనిహితైర్గోసర్పిషా
లోడితైః
దీపైర్దీర్ఘతరాన్ధకారభిదురైర్బాలార్కకోటిప్రభైః
।
ఆతామ్రజ్వలదుజ్జ్వలప్రవిలసద్రత్నప్రదీపైస్తథా
మాతస్త్వామహమాదరాదనుదినం
నీరాజయామ్యుచ్చకైః ॥ ౨౯॥
మాతస్త్వాం
దధిదుగ్ధపాయసమహాశాల్యన్నసన్తానికాః
సూపాపూపసితాఘృతైః
సవటకైః సక్షౌద్రరమ్భాఫలైః ।
ఏలాజీరకహిఙ్గునాగరనిశాకుస్తుమ్భరీసంస్కృతైః
శాకైః సాకమహం
సుధాధికరసైః సన్తర్పయామ్యర్చయన్ ॥ ౩౦॥
సాపూపసూపదధిదుగ్ధసితాఘృతాని
సుస్వాదుభక్తపరమాన్నపురఃసరాణి
।
శాకోల్లసన్మరిచిజీరకబాహ్నికాని
భక్ష్యాణి
భుఙ్క్ష్వ జగదమ్బ మయార్పితాని ॥ ౩౧॥
క్షీరమేతదిదమ్ముత్తమోత్తమం
ప్రాజ్యమాజ్యమిదముజ్జ్వలం
మధు ।
మాతరేతదమృతోపమం
పయః
సమ్భ్రమేణ
పరిపీయతాం ముహుః ॥ ౩౨॥
ఉష్ణోదకైః
పాణియుగం ముఖం చ
ప్రక్షాల్య మాతః
కలధౌతపాత్రే ।
కర్పూరమిశ్రేణ
సకుఙ్కుమేన
హస్తౌ సముద్వర్తయ
చన్దనేన ॥ ౩౩॥
అతిశీతముశీరవాసితం
తపనీయే కలశే
నివేశితమ్ ।
పటపూతమిదం
జితామృతం
శుచి గఙ్గాజలమమ్బ
పీయతామ్ ॥ ౩౪॥
జమ్బ్వామ్రరమ్భాఫలసంయుతాని
ద్రాక్షాఫలక్షౌద్రసమన్వితాని
।
సనారికేలాని
సదాడిమాని
ఫలాని తే దేవి
సమర్పయామి ॥ ౩౫॥
కూశ్మాణ్డకోశాతకిసంయుతాని
జమ్బీరనారఙ్గసమన్వితాని
।
సబీజపూరాణి
సబాదరాణి
ఫలాని తే దేవి
సమర్పయామి ॥ ౩౬॥
కర్పూరేణ
యుతైర్లవఙ్గసహితైస్తక్కోలచూర్ణాన్వితైః
సుస్వాదుక్రముకైః
సగౌరఖదిరైః సుస్నిగ్ధజాతీఫలైః ।
మాతః
కైతకపత్రపాణ్డురుచిభిస్తామ్బూలవల్లీదలైః
సానన్దం
ముఖమణ్డనార్థమతులం తామ్బూలమఙ్గీకురు ॥ ౩౭॥
ఏలాలవఙ్గాదిసమన్వితాని
తక్కోలకర్పూరవిమిశ్రితాని
।
తామ్బూలవల్లీదలసంయుతాని
పూగాని తే దేవి
సమర్పయామి ॥ ౩౮॥
తామ్బూలనిర్జితసుతప్తసువర్ణవర్ణం
స్వర్ణాక్తపూగఫలమౌక్తికచూర్ణయుక్తమ్
।
సౌవర్ణపాత్రనిహితం
ఖదిరేన సార్ధం
తామ్బూలమమ్బ
వదనామ్బురుహే గృహాణ ॥ ౩౯॥
మహతి కనకపాత్రే
స్థాపయిత్వా విశాలాన్
డమరుసదృశరూపాన్బద్ధగోధూమదీపాన్
।
బహుఘృతమథ తేషు
న్యస్య దీపాన్ప్రకృష్టా-
న్భువనజనని
కుర్వే నిత్యమారార్తికం తే ॥ ౪౦॥
సవినయమథ దత్వా
జానుయుగ్మం ధరణ్యాం
సపది శిరసి
ధృత్వా పాత్రమారార్తికస్య ।
ముఖకమలసమీపే
తేఽమ్బ సార్థం త్రివారం var సార్ధం
భ్రమయతి మయి
భూయాత్తే కృపార్ద్రః కటాక్షః ॥ ౪౧॥
అథ
బహుమణిమిశ్రైర్మౌక్తికైస్త్వాం వికీర్య
త్రిభువనకమనీయైః
పూజయిత్వా చ వస్త్రైః ।
మిలితవివిధముక్తాం
దివ్యమాణిక్యయుక్తాం
జనని కనకవృష్టిం
దక్షిణాం తేఽర్పయామి ॥ ౪౨॥
మాతః
కాఞ్చనదణ్డమణ్డితమిదం పూర్ణేన్దుబిమ్బప్రభం
నానారత్నవిశోభిహేమకలశం
లోకత్రయాహ్లాదకమ్ ।
భాస్వన్మౌక్తికజాలికాపరివృతం
ప్రీత్యాత్మహస్తే ధృతం
ఛత్రం తే
పరికల్పయామి శిరసి త్వష్ట్రా స్వయం నిర్మితమ్ ॥ ౪౩॥
శరదిన్దుమరీచిగౌరవర్ణై-
ర్మణిముక్తావిలసత్సువర్ణదణ్డైః
।
జగదమ్బ
విచిత్రచామరైస్త్వా-
మహమానన్దభరేణ
బీజయామి ॥ ౪౪॥
మార్తాణ్డమణ్డలనిభో
జగదమ్బ యోఽయం
భక్త్యా మయా
మణిమయో ముకురోఽర్పితస్తే ।
పూర్ణేన్దుబిమ్బరుచిరం
వదనం స్వకీయ-
మస్మిన్విలోకయ విలోలవిలోచనే
త్వమ్ ॥ ౪౫॥
ఇన్ద్రాదయో
నతినతైర్మకుటప్రదీపై-
ర్నీరాజయన్తి
సతతం తవ పాదపీఠమ్ ।
తస్మాదహం తవ
సమస్తశరీరమేత-
న్నీరాజయామి
జగదమ్బ సహస్రదీపైః ॥ ౪౬॥
ప్రియగతిరతితుఙ్గో
రత్నపల్యాణయుక్తః
కనకమయవిభూషః
స్నిగ్ధగమ్భీరఘోషః ।
భగవతి కలితోఽయం
వాహనార్థం మయా తే
తురగశతసమేతో
వాయువేగస్తురఙ్గః ॥ ౪౭॥
మధుకరవృతకుమ్భన్యస్తసిన్దూరరేణుః
కనకకలితఘణ్టాకిఙ్కణీశోభికణ్ఠః
।
శ్రవణయుగలచఞ్చచ్చామరో
మేఘతుల్యో
జనని తవ ముదే
స్యాన్మత్తమాతఙ్గ ఏషః ॥ ౪౮॥
ద్రుతతరతురగైర్విరాజమానం
మణిమయచక్రచతుష్టయేన
యుక్తమ్ ।
కనకమయమముం
వితానవన్తం
భగవతి తే హి రథం
సమర్పయామి ॥ ౪౯॥
హయగజరథపత్తిశోభమానం
దిశి దిశి
దున్దుభిమేఘనాదయుక్తమ్ ।
అతిబహు
చతురఙ్గసైన్యమేత-
ద్భగవతి
భక్తిభరేణ తేఽర్పయామి ॥ ౫౦॥
పరిఘీకృతసప్తసాగరం
బహుసమ్పత్సహితం
మయామ్బ తే విపులమ్ ।
ప్రబలం
ధరణీతలాభిధం
దృఢదుర్గం నిఖిలం
సమర్పయామి ॥ ౫౧॥
శతపత్రయుతైః స్వభావశీతైః
అతిసౌరభ్యయుతైః
పరాగపీతైః ।
భ్రమరీముఖరీకృతైరనన్తైః
వ్యజనైస్త్వాం
జగదమ్బ వీజయామి ॥ ౫౨॥
భ్రమరలులితలోలకున్తలాలీ-
విగలితమాల్యవికీర్ణరఙ్గభూమిః
।
ఇయమతిరుచిరా నటీ
నటన్తీ
తవ హృదయే
ముదమాతనోతు మాతః ॥ ౫౩॥
ముఖనయనవిలాసలోలవేణీ-
విలసితనిర్జితలోలభృఙ్గమాలాః
।
యువజనసుఖకారిచారులీలా
భగవతి తే పురతో
నటన్తి బాలాః ॥ ౫౪॥
భ్రమదలికులతుల్యాలోలధమ్మిల్లభారాః
స్మితముఖకమలోద్యద్దివ్యలావణ్యపూరాః
।
అనుపమితసువేషా
వారయోషా నటన్తి
పరభృతకలకణ్ఠ్యో
దేవి దైన్యం ధునోతు ॥ ౫౫॥
డమరుడిణ్డిమజర్ఝరఝల్లరీ-
మృదురవద్రగడద్ద్రగడాదయః
।
ఝటితి ఝాఙ్కృతఝాఙ్కృతఝాఙ్కృతైః
బహుదయం హృదయం
సుఖయన్తు తే ॥ ౫౬॥
విపఞ్చీషు
సప్తస్వరాన్వాదయన్త్య-
స్తవ ద్వారి
గాయన్తి గన్ధర్వకన్యాః ।
క్షణం సావధానేన
చిత్తేన మాతః
సమాకర్ణయ త్వం
మయా ప్రార్థితాసి ॥ ౫౭॥
అభినయకమనీయైర్నర్తనైర్నర్తకీనాం
క్షనమపి రమయిత్వా
చేత ఏతత్త్వదీయమ్ ।
స్వయమహమతిచితైర్నృత్తవాదిత్రగీతైః
భగవతి భవదీయం
మానసం రఞ్జయామి ॥ ౫౮॥
తవ దేవి
గుణానువర్ణనే
చతురా నో
చతురాననాదయః ।
తదిహైకముఖేషు
జన్తుషు
స్తవనం కస్తవ
కర్తుమీశ్వరః ॥ ౫౯॥
పదే పదే
యత్పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి ।
తత్సర్వపాపక్షయ
హేతుభూతం ప్రదక్షిణం తే పరితః కరోమి ॥ ౬౦॥
రక్తోత్పలారక్తలతాప్రభాభ్యాం
ధ్వజోర్ధ్వరేఖాకులిశాఙ్కితాభ్యామ్ ।
అశేషబృన్దారకవన్దితాభ్యాం
నమో భవానీపదపఙ్కజాభ్యామ్ ॥ ౬౧॥
చరణనలినయుగ్మం
పఙ్కజైః పూజయిత్వా
కనకకమలమాలాం
కన్ఠదేశేఽర్పయిత్వా ।
శిరసి
వినిహితోఽయం రత్నపుష్పాఞ్జలిస్తే
హృదయకమలమధ్యే దేవి
హర్షం తనోతు ॥ ౬౨॥
అథ
మణిమయఞ్చకాభిరామే
కనకమయవితానరాజమానే
।
ప్రసరదగరుధూపధూపితేఽస్మి-
న్భగవతి
భవనేఽస్తు తే నివాసః ॥ ౬౩॥
ఏతస్మిన్మణిఖచితే
సువర్ణపీఠే
త్రైలోక్యాభయవరదౌ
నిధాయ హస్తౌ ।
విస్తీర్ణే
మృదులతరోత్తరచ్ఛదేఽస్మి-
న్పర్యఙ్కే
కనకమయే నిషీద మాతః ॥ ౬౪॥
తవ దేవి
సరోజచిహ్నయోః పదయోర్నిర్జితపద్మరాగయోః ।
అతిరక్తతరైరలక్తకైః
పునరుక్తాం రచయామి రక్తతామ్ ॥ ౬౫॥
అథ
మాతరుశీరవాసితం నిజతామ్బూలరసేన రఞ్జితమ్ ।
తపనీయమయే హి
పట్టకే ముఖగణ్డూషజలం విధీయతామ్ ॥ ౬౬॥
క్షణమథ జగదమ్బ
మఞ్చకేఽస్మి-
న్మృదుతలతూలికయా
విరాజమానే ।
అతిరహసి ముదా
శివేన సార్ధం
సుఖశయనం కురు
తత్ర మాం స్మరన్తీ ॥ ౬౭॥
ముక్తాకున్దేన్దుగౌరాం
మణిమయకుటాం రత్నతాటఙ్కయుక్తా-
మక్షస్రక్పుష్పహస్తామభయవరకరాం
చన్ద్రచూడాం త్రినేత్రామ్ ।
నానాలఙ్కారయుక్తాం
సురమకుటమణిద్యోతితస్వర్ణపీఠాం
సానన్దాం
సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చిన్తయామి ॥ ౬౮॥
ఏషా భక్త్యా తవ
విరచితా యా మయా దేవి పూజా
స్వీకృత్యైనాం
సపది సకలాన్మేఽపరాధాన్క్షమస్వ ।
న్యూనం యత్తత్తవ
కరుణయా పూర్ణతామేతు సద్యః
సానన్దం మే
హృదయకమలే తేఽస్తు నిత్యం నివాసః ॥ ౬౯॥
పూజామిమాం యః
పఠతి ప్రభాతే
మధ్యాహ్నకాలే యది
వా ప్రదోషే ।
ధ్రమార్థకామాన్పురుషోఽభ్యుపైతి
దేహావసానే
శివభావమేతి ॥ ౭౦॥
పూజామిమాం
పఠేన్నిత్యం పూజాం కర్తుమనీశ్వరః ।
పూజాఫలమవాప్నోతి
వాఞ్ఛితార్థం చ విన్దతి ॥ ౭౧॥
ప్రత్యహం
భక్తిసంయుక్తో యః పూజనమిదం పఠేత్ ।
వాగ్వాదిన్యాః
ప్రసాదేన వత్సరాత్స కవిర్భవేత్ ॥ ౭౨॥
ఇతి
శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛఙ్కరభగవతః
కృతౌ
దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రం
సమ్పూర్ణమ్ ॥
కర్పూర తాంబూలము
దేవికి సమర్పించే కర్పూర తాంబూలము లోని పదార్థాలు.
తమలపాకులు
యాలకులు
లవంగాలు
పచ్చ కర్పూరము
కస్తూరి
నాగకేసరాలు
జాజికాయ
పోకచెక్కలు
కొబ్బరి ముక్కలు
మిరియాలు
శొంఠి
సున్నము
కాచు
కవ్విరి
మున్నగు వస్తువులతో కూడిన తాంబూలాన్ని కర్పూర తాంబూలము అని అంటారు