చాతుర్మాస్యం
ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ
ద్వాదశితో అంతమయ్యే నాలుగు మాసములు చాతుర్మాసములుగా వ్యవహరించుదురు.
ఆషాఢ పౌర్ణమి మొదలు శ్రావణ పౌర్ణమి వరకు – శాక
వ్రతము
అనగా శాకములతో వండినవి భుజింపరాదు. కేవలము
పప్పు పదార్థాలతో వండిన వంటకములు మాత్రమే భుజించవలెను. మిరియాలు, జీలకర్ర
తప్ప ఇతర సుగంధ ద్రవ్యములు వాడరాదు.
శ్రావణ పౌర్ణమి మొదలు భాద్రపద పౌర్ణమి వరకు –
దధి వ్రతము
అనగా దధి సంబదిత పదార్థములు భుజింపరాదు.
భాద్రపద పౌర్ణమి మొదలు ఆశ్వయుజ పౌర్ణమి వరకు –
క్షీర వ్రతము
అనగా పాలతో వండిన పదార్థములు భుజింపరాదు.
ఆశ్వయుజ పౌర్ణమి మొదలు కార్తీక పౌర్ణమి వరకు –
ద్విదళ వ్రతము
అనగా ఏ విధమైన పప్పు పదార్థములు భుజింపరాదు.
మరియు వర్జింప వలసిన పదార్థములు.
వంకాయ, పొట్లకాయ, పుచ్చకాయ, ముల్లంగి, గుమ్మడి,
బొబ్బర్లు, ఉలవలు, చెఱకు, కొత్తరేగుపళ్ళు, ఉసిరిక పప్పు, చింతపండు,
No comments:
Post a Comment