ఉపనయనము
మానవుడు
తన జీవితకాలంలో సామాజిక,
ఆధ్యాత్మిక ప్రగతి కోసం
బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం,
సన్యాసం అనే నాలుగు దశలను పాఠించాలి.
బ్రహ్మచర్యంలో
ఉపనయనం, వేదారంభ సంస్కారం,
సమావర్తన సంస్కారం అను
మూడు సంస్కారాలు ఉన్నాయి.
“ఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప”
అనగా వేదాధ్యాయనం
కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము.
ఉపనయనం ...
“ఉప” “నయనం” అంటే
“దివ్య చక్షువు” అనే అర్థాన్ని మనము తెలుసుకోవాలి. ఉపనయనం జరిగినప్పటి
నుండి ఆ వ్యక్తికి గురువుద్వారా వేదాధ్యయనము చేయుటకు అధికారం లభిస్తుంది. తద్వారా
ఆవ్యక్తి యొక్క “జ్ఞాన నేత్రము” తెరుచు కొని జ్ఞాన సముపార్జన చేసుకోగల అవకాశం
కల్పింపబడుతుంది.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు
ఈ ఉపనయనం తప్పనిసరి.
ఉపనయనం జరిగినప్పటి నుండి
ఆ వ్యక్తి బ్రహ్మచారిగా
పరిగణింపబడతాడు.
వేదారంభ సంస్కారం – బ్రహ్మచారి, గాయత్రీ మంత్రం మొదలు నాలుగు వేదాలూ పఠించడానికి గురుకులంలో చేరి, అందుకు సంబంధించిన పద్ధతులు తెలుసుకోవడాన్ని వేదారంభ సంస్కారం అంటారు.
వేదారంభ సంస్కారం – బ్రహ్మచారి, గాయత్రీ మంత్రం మొదలు నాలుగు వేదాలూ పఠించడానికి గురుకులంలో చేరి, అందుకు సంబంధించిన పద్ధతులు తెలుసుకోవడాన్ని వేదారంభ సంస్కారం అంటారు.
సమావర్తన సంస్కారం
- విద్యాభ్యాసం ముగించి, గురుకులాన్ని
విడిచివెళ్లే విద్యార్థికి సమావర్తన
సంస్కారం జరుగుతుంది. దీంతోపాటు
వివాహానికి సిద్ధపరిచే మంగళస్నానం
కూడా చేయబడుతుంది. ఈ
సంస్కారం పొందిన వానిని
స్నాతకుడు అంటారు. అయితే ఈ రోజుల్లో ఈ స్నాతక సంస్కారాన్ని వివాహ సమయంలో ఒక తంతుగా నిర్వహించడం
పద్దతిగా వస్తున్నాది.
ఒక వ్యక్తి ఉపనయనం చేయకముందు బాలుడు కనుక తెలియక చేసే తప్పులకు పాపం, తనకు అంటదు. ఉపనయనం తరవాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు కనుక తరువాత చేసే పాపకర్మలు తనకే చెందుతాయి. అందువలన ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తరావత ఒక జన్మగా పరిగణించి ఉపనయన సంస్కారము జరిగిన బ్రాహ్మణుడుని ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం.
“జన్మనా జ్జాయతే శూద్రః, సంస్కారాత్
ద్విజయుచ్చతే”
– మనిషి పుట్టుకతో శూద్రుడే, అయినా
సుసంస్కారముచేత ద్విజుడుగా వ్యవహరింపబడుతాడు.
ఆపస్తంభ సూత్రం ప్రకారము
‘గర్భాష్ట మేషు బ్రాహ్మణ ముష్ణయీత, గర్భఏకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషువైశ్యం’
అనగా బ్రాహ్మణులకు గర్భంతో
కలిపి ఎనిమిదవ సంవత్సరం,
రాజులకు గర్భంతో కలిపి
పదకొండవ సంవత్సరం, వైశ్యులకు
గర్భంతో కలిపి పన్నెండవ
సంవత్సరం ఉపనయనమునకు విశేషం
అని చెప్పారు.
అయితే
కారణాంతరాలవలన ఈరోజుల్లో ఈ వయసు నిర్ధిష్ఠతను పాఠించడం అరుదైంది. అయితే ఈ విదంగా
వయసు నిర్ధిష్ఠతను పాఠించకుండా ఉపనయనముచేసేటప్పుడు వాటి ఫలితాంశములు తెలుసుకోవడం
ఎంతైనా అవసరము
ఆపస్తంభ సూత్రం ప్రకారము
సప్తమే
బ్రహ్మవర్చసకామం, అష్టమమాయుష్కాయం, నవమే తేజస్కామం,
దశమే అన్నాద్య కామం, ఏకాదశ
ఇంద్రియ కామం,
ద్వాదశే పశుకామం అని చెప్పబడినది.
అనగా ఏడవ
సంవత్సరంలో బ్రహ్మవర్ఛస్సు, ఎనిమిదవ సంవత్సరంలో ఆయుః వృద్ధి, తొమ్మిదవ సంవత్సరంలో తేజస్సు,
దశమ వర్షంలో అన్నాది కాంక్ష,
పదకొండవ సంవత్సరంలో ఇంద్రియ కాంక్ష,
పన్నెండవ సంవత్సరంలో పశు కాంక్ష
కలగుతాయని శాస్త్రములో చెప్పబడినది.
ఇదేవిధంగా ఉపనయనం
చేయుటకు గరిష్ట వయోపరిమితి కూడా వేదములలో నిర్ధేశించబడినది.
“అ షోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రీనాతి వర్తతే”
అంటే 16వ
సంవత్సరం దాటిన తరువాత
ఉపనయనం వలన సావిత్రీ
అనుగ్రహింపదు. అందువలన 16వ
సంవత్సరంలోపు ఉపనయనం చేయమని
శాస్త్రం.
ఈ వయో పరిమితి యొక్క అంతరార్థము ఏమనగా
కామవికారములు మనస్సులోనికి ప్రవేశంచటకు
ముందే బాలుడు గాయత్రీ మంత్రమును అనుష్ఠించి ఆ మంత్ర ప్రభావముచేత వేదవేదాంగములను చక్కగా అధ్యయనం చేయాలన్నదే
ఉపనయన లక్ష్యము. కామవికారములకు వశమైన మనస్సు లక్ష్యం
నుండి దూరమై సంపాదించిన మంత్ర శక్తి క్షీణించిపోయు వేదాధ్యయనం కుంటుబడుతుంది. చిన్న వయస్సులోనే గాయత్రీ మంత్రోపదేశం
పొందిన బాలుడు కామోద్భవం జరిగే వయస్సు వచ్చేనాటికి గాయత్రీ మంత్ర పునశ్చరణ చేత ప్రావీణ్యతను
పొందగలుగుతాడు. విద్యలో కొంత స్థాయిని చేరతాడు. గాయత్రి నిండిన మనస్సులో కామానికి
చోటుండదు. పదహారేళ్ల వయస్సులో ఉపనయనమయిన వారికి ఇది
సాధ్యపడదు. అందువల్లనే ఉపనయనం జరగవలసిన వయస్సు
నిర్ణయించబడింది.
అలాగే ఉపనయనమునకు శ్రేష్టమయిన కాలము
గురించి శాస్త్రములో ఈ విధంగా సూచించబడినది.
“వసంతే బ్రాహ్మణ ముపనయితే, గ్రీష్మే
రాజన్యం, శరదివైశ్యం, మాఘాధి శుక్రాంతం పంచమాసావా సాధారణా సకలద్విజనాం”
అనగా వసంత ఋతువు బ్రాహ్మణులకు, గ్రీష్మ
ఋతువు క్షత్రియులకు, శరదృతువు వైశ్యులకు ఉపనయమునకు విశేషమైన కాలముగా చెప్పబడినది. అలాగే మాఘమాసంతో మొదలైన ఐదుమాసములు అనగా మాఘ,
ఫాల్గుణ, చైత్ర, వైశాఖ,జ్యేష్ట మాసములు కూడా ఉపనయనమునకు అనుకూలమైనవే. ఈ మాసములన్ని
ఉత్తరాయణ కాలంలో ఉండడంవలన, ఉత్తరాయణ కాలం ఉపనయనమునకు శ్రేష్ఠంగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితులలోను దక్షిణాయన కాలంలో
జరగరాదు.
తరవాత ఉపనయనము చేయుటకు అధికారము గలవారు శాస్త్రములో పేర్కొనబడినారు.
“పీతైవోపనయేత్పుత్రం తదభావే పితః పితా;
తదభావే పితుర్భ్రాతా, తదభావేతు సోదర; తదభావే సగోత్ర సపిండా; తదభావేన సపిండ సగోత్రజ;”
ఉపనయనము చేయుటకు తండ్రి, పితామహుడు (తాత), తండ్రి సోదరుడు (
పినతండ్రి లేదా పెద తండ్రి), సోదరుడు, సగోత్రులు మొదలగు వారు అర్హులు.
No comments:
Post a Comment