Thursday, 21 April 2016

ADITYAHRUDAYA PARAYANAM

 
 
 
ఆదిత్య హృదయము
 

 
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్అని సూక్తి.

అనునిత్యం మనకు సూర్యభగవానునిగా ప్రత్యక్షదర్శనమిచ్చే భగవత్స్వరూపుడు సాక్షాత్ విష్ణుమూర్తియే.  సర్వేశ్వరుడు తనను తాను దర్శింపజేసుకునేందుకు సూర్యనారాయణమూర్తి రూపంలో దర్శనమిస్తున్నాడు. స్సర్వ వ్యాప్తమైన సర్వేశ్వరుడు బాహ్యాకాశములో సూర్యభగవానునిగా, దహరాకాశములో (హృదయములో) విష్ణుమూర్తిగా తేజస్సును నింపి చైతన్యమును కలుగజేస్తాడు. ఇదే విషయము మనకు నారాయణసూక్తములోఅంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్తనారాయణ స్థితఃఅని చెప్పడమైనది.

ప్రత్యక్షంగా మనము కోరకపోయినా, అనునిత్యం మనకు దర్శనమిచ్చే దివ్యమంగళ రూపుడైన సూర్యభగవానుని ఆరాధించుటకు వేదములలోనూ ఉపనిషత్తులలోనూ అనేక మార్గములు తెలుపబడినవి.

ఋగ్వేదములోమహాసౌరము

యజుర్వేదములోఅరుణప్రశ్న,అక్ష్యుపనిషత్తు,

అథర్వణ వేదంలో - సూర్యోపనిషత్తు

మొదలగు వాటిల్లో సూర్యాఅరాధన   చెప్పబడినది.

అయితే వేద పరిజ్ఞానము లేని వారు, వేదాధ్యయనమునకు అవకాశములేని వారు సులభముగా సూర్యభగవానుని ఆరాధించుట కొరకై మన ఋషులు, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము మొదలగు సులభతరమైన ఆరాధనా విధానములు సూచించేరు. మనము వీటి అర్థములు చక్కగా తెలుసుకొని, నిత్యము పారాయణ చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధిస్తాయనడంలో ఎంతమాత్రము సంశయము లేదు.

ఆదిత్య హృదయమును రామరావణ యుద్దమునందు, రావణునితో యుద్దము చేసి అలసియున్న శ్రీరాముని చూచి, అగస్త్యమహర్షి, కార్యసిద్ధి, విజయము చేకూరుటకై శ్రీరామునకు సూర్యభగవానుని ఉపాసించమని ఆదేశించెను. ఆదేశములే రామాయణ మహాకావ్యములో వాల్మీకిమహర్షి  ఆదిత్యహృదయ స్తోత్రంగాపొందుపర్చినారు.

మహా భారతములో కురుపాండవుల సంగ్రామము జరిగిన ప్రదేశమైన కురుక్షేత్రములో నిరాసక్తితో చతికిలబడిన అర్జునునకు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినదిభగవత్ గీతఅయితే

రామాయణం లో రామరావణ సంగ్రామము జరిగిన ప్రదేశమైన లంకానగరములో విచారములో ఉన్న విష్ణుమూర్తి అవతారమైన రామచంద్ర ప్రభువునకు అగస్త్యమహాముని ఉపదేశించినదిఅగస్త్యగీత

31 శ్లోకాలతో కూర్చిన స్తోత్రములో ఉపోద్గాతంగా మొదటి  ఐదు శ్లోకాలు, ఫలశృతి రూపంగా చివరి ఏడు శ్లోకాలు పోగా, మిగిలిన పంతొమ్మిది శ్లోకములలో వేదములు, ఉపనిషత్తులలో ఉన్న సారమునంతటిని వాల్మీకి మహర్షి వారు సూర్యుని స్తుతించే 126 దివ్య నామములుగా గొప్ప రచన చేసేరు.

ఆదిత్యహృదయము అనగా ఆదిత్యుని హృదయమునందు ఉపాసించుట. ఉపాసనా పరమైన ఆదిత్య హృదయమును మూడు కోణములలో భావన చేస్తూ ఉపాసించవలెను. అవి ఒకటిపరబ్రహ్మ స్వరూపముగనురెండవది మండలాతర్గతమైన తేజస్సుగను, మూడవది హృదయాంతర్గత ఆత్మ స్వరూపముగనుభావించి ఉపాసన చేయవలెను.

ఈ ఆదిత్యహృదయ పారాయణ ఏ విధముగా చేయవలెననగా

సూర్యోదయ పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యావందనము చేసుకొని (సంధ్యావందనము సూర్యోదయమునకు పూర్వము ప్రారంబించి సూర్యోదయముకాగానే ఉపస్థానమంత్రముతొ ముగించడం వైదిక పద్ధతి)   సూర్యుని ఎదురుగా నిలబడి మొదటి ఐదు శ్లోకములు ఒకసారి పఠించి, ఆరు నుండి ఇరవైనాలుగవ శ్లోకమువరకు అనగా “రశ్మిమంతం” మొదలుకొని “ సర్వ ఏష రవి ప్రభుః” వరకు మూడు సార్లు పఠించవలెను. మూడు సార్లు పఠించిన తరువాత చివరగా ఫలశృతి పఠించవలెను.

ఈ విధంగా పఠించగలిగితే ఫలితాలు దివ్యంగా ఉంటాయి.

రోజూ అవకాశము లేకపోతే కనీసము భానువారం, సప్తమితో కూడిన భానువారం, రధసప్తమి దినములలోనైనా పఠించవలెను.

స్త్రీలకు సంధ్యావందన నియమము వేదము విధించలేదు కావున వారు సూర్యోదయానంతరము( సూర్యుని యొక్క ఎరుపు వర్ణము పోయి హిరణ్య (బంగారు) వర్ణము రాగానే పారాయణ ప్రారంభిచవచ్చును.

వృద్దులు, నిలబడి పారాయణచేయలేనివారు వారివారి వీలుబట్టి సూర్యుని ఎదురుగా పారాయణ చేసుకోవచ్చు.

ఆదిత్యహృదయము ఈ క్రింద పొందు పరచడమైనది.
ఆదిత్య హృదయం

ఉపోద్ఘాతము:

తతో యుద్ధ పరిశ్రాంతం, సమరే చింతయా స్థితమ్| రావణం చాగ్రతో దృష్ట్వా, యుద్ధాయ సముపస్థితమ్ ||1||

దైవతైశ్చ సమాగమ్య, ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపగమ్యా బ్రవీద్రామమ్, అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||

రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనమ్ |యేన సర్వాన్ అరీన్ వత్స, సమరే విజయిష్యసి || 3 ||

ఆదిత్య హృదయం పుణ్యం, సర్వశత్రు వినాశనమ్ |జయావహం జపేన్నిత్యమ్, అక్షయ్యం పరమం శివమ్|4

సర్వమంగళ మాంగళ్యం, సర్వ పాప ప్రణాశనమ్ | చింతాశోక ప్రశమనమ్, ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||

స్తోత్రము:

రశ్మిమంతం సముద్యంతం, దేవాసుర నమస్కృతమ్ |పూజయస్వ వివస్వంతం, భాస్కరం భువనేశ్వరమ్6

సర్వదేవాత్మకో  ఏష, తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసుర గణాన్, లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||

ఏష బ్రహ్మా విష్ణుశ్చ, శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలః, యమః సోమః అపాం పతిః || 8 ||

పితరో వసవః సాధ్యాః ,అశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణః, ఋతుకర్తా ప్రభాకరః || 9 ||

ఆదిత్యః సవితా సూర్యః, ఖగః  పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుః, హిరణ్యరేతా దివాకరః || 10 ||

హరిదశ్వః సహస్రార్చిః, సప్తసప్తిః మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుః, త్వష్టా మార్తాండ అంశుమాన్ || 11 ||

హిరణ్యగర్భః శిశిరః, తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోదితేః పుత్రః, శంఖః శిశిరనాశనః || 12 ||

వ్యోమనాథః తమోభేదీ, ఋక్ యజుః సామ పారగః | ఘనావృష్టి రపాం మిత్రో, వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||

ఆతపీ మండలీ మృత్యుః, పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజా, రక్తః సర్వభవోద్భవః || 14 ||

నక్షత్ర గ్రహ తారాణామ్, అధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ, ద్వాదశాత్మన్ నమోస్తు తే || 15 ||

నమః పూర్వాయ గిరయే, పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే, దినాధిపతయే నమః || 16 ||

జయాయ జయభద్రాయ, హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో, ఆదిత్యాయ నమో నమ|17

నమ ఉగ్రాయ వీరాయ, సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ, మార్తాండాయ నమో నమః|18 ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ, సూర్యాయాదిత్య-వర్చసే | భాస్వతే సర్వభక్షాయ, రౌద్రాయ వపుషే నమః || 19 ||

తమోఘ్నాయ హిమఘ్నాయ,శత్రుఘ్నాయఅమితాత్మనే|కృతఘ్నఘ్నాయ దేవాయ, జ్యోతిషాం పతయే నమః 20

తప్త చామీకరాభాయ, వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోభి నిఘ్నాయ, రుచయే లోకసాక్షిణే || 21 ||

నాశయత్యేష వై భూతం, తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష, వర్షత్యేష గభస్తిభిః || 22 ||

ఏష సుప్తేషు జాగర్తి, భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం , ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||

వేదాశ్చ క్రతవశ్చైవ, క్రతూనాం ఫలమేవ | యాని కృత్యాని లోకేషు. సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||

ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు, కాంతారేషు భయేషు | కీర్తయన్ పురుషః కశ్చిన్, నావశీదతి రాఘవ || 25 ||

పూజయస్వైన మేకాగ్రో, దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా, యుద్ధేషు విజయిష్యసి || 26 ||

అస్మిన్ క్షణే మహాబాహో, రావణం త్వం వధిష్యసి|ఏవముక్త్వా తదా అగస్త్యో, జగామ యథాగతమ్ || 27 ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః, నష్టశోకో అభవత్-తదా | ధారయామాస సుప్రీతో, రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు, పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా, ధనురాదాయ వీర్యవాన్ || 29|

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా, యుద్ధాయ సముపాగమత్ |సర్వయత్నేన మహతా వధే, తస్య ధృతో అభవత్ ||30||

అథ రవిరవదన్-నిరీక్ష్య రామం, ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా, సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||

No comments:

Post a Comment