మన దేహములో అంతర్గతమై ఉన్న షట్ చక్రముల వివరణ
అభేద రూపమైన
పరమాత్ముడు-పరాశక్తి మనదేహములో చైతన్య రూపమై ఉంటారు.
మూకపంచశతి లో మూక
కవి వర్ణించిన అమ్మవారి స్వరూపము
“ జలధి ద్విగుణిత
హుతవహ
దిశా దినేశ్వర కలా అశ్వినేయ దలైః
నలినై ర్మహేశి! గచ్చసి
సర్వోత్తర కరకమల దల మమలమ్|| .. (96 ఆర్యాశతకము)
దీని వివరణ
జలధి – అనగా
నాలుగుదిక్కులా ఉన్న నాలుగు సముద్రములు – అనగా నాలుగు దళములుగల మూలాధారచక్రంలో గల
మూలాధార కమలము – (వ శ ష స)
ద్విగుణిత హుతవహ –
అనగా ద్విగుణములైన మూడు రకాలైన అగ్నులు(గార్హపత్య,అహవనీయ,దక్షిణ)- అనగా ఆరు దళములు
గల స్వాధిష్టాన చక్రములో గల స్వాధిష్టాన కమలము ( బ భ మ య ర ల)
దిశా- అనగా పది
దిక్కులు – అనగా పది దళములుగల మణిపూరక చక్రములో గల మణిపూరక కమలము ( డ ఢ ణ త థ ద ధ
న ప ఫ)
దినేశ్వర – అనగా
పన్నెండు నెలలలో ఉదయించు పన్నెండు సూర్యులు – అనగా పన్నెండు దళములు గల అనాహత
చక్రములో గల అనాహత కమలము ( క ఖ గ ఘ ఙ్ చ ఛ జ ఝ ఞ్ ట ఠ)
కలా- అనగా
చంద్రుని పదహారు కళలు – అనగా పదహారు దళములు గల విశుద్ధిచక్రములో గల విశుద్ధికమలము
( అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ లు లూ ఎ ఐ ఓ ఔ అం అః)
అశ్వినేయ – అనగా
ఇద్దరు అశ్వినీ దేవతలు – అనగా రెండు దళములు గల అజ్ఞాచక్రములో గల అజ్ఞాకమలము (ళ హ)
మన దేహములో అంతర్గతమై ఉన్న షట్ చక్రముల వివరణ
అలాగే “లలితా రహస్యనామ సహస్ర స్తోత్రం” లో కూడా ఈ షట్ చక్రాల ప్రస్తావన ఉంది.
మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదిని – 99,100
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదిని – 101,102
ఆజ్ఞాచక్రాంతరాళస్తా రుద్రగ్రంధి విభేదిని – 103,104
పర దేవత అయిన శ్రీ లలితాంబికా దేవి 34 తత్వములతో నిర్మితమైన మన దేహములో ఏడుగురు యోగినీ దేవతల రూపములతో అదిష్టానదేవతలుగా షట్చక్రములలోను, సప్త ధాతువులలోను (చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము ) అంతర్భూతమై, అ మొదలు క్ష వరకు గల శక్తి దేవతలు సదా సేవిస్తూ భాసించుచున్నది
ఈ విషయములు పరమగోప్యమైన లలితా సహస్రనామావళిలో నిక్షిప్తమైయున్నది(98-110శ్లోకములు)(475-535 నామములు)
విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా |
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ |
డాకినీ దేవి రూపములో కంఠస్థానమందున్న విశుద్ధి చక్రములో పదునారు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఏక ముఖముతో పాఠల వర్ణము (ఎరుపు-తెలుపు కలసిన) కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి చర్మ ధాతువు నందు శక్తి రూపమై, పాయసాన్నము ఇష్టముగా స్వీకరించును.
అమృతాది పదహారు శక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
(అమృతా, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉమా, ఊర్థ్వకేశి, ఋద్ధిర, ౠకార, ఌకార, ౡకార, ఏకపదా, ఐశ్వర్యా, ఓంకారి, ఔషధి, అంబికా, అఃక్షర)
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా |
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ |
రాకినీ దేవి రూపములో హృదయస్థానమందున్న అనాహత చక్రములో పండ్రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు రెండు ముఖములతో శ్యామల వర్ణము (ఎరుపుతో కూడిన నలుపు) కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి రక్త ధాతువు నందు శక్తి రూపమై, నేతితో కలిపిన అన్నము ఇష్టముగా స్వీకరించును.
కాళరాత్రి మొదలైన పండ్రెండు శక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
(కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, ఙ్ఞామిని, చంద్ర, ఛాయా, జయా, ఝంకారి, ఙ్ఞానరూపా, టంకహస్తా, ఠంకారిణి)
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా |
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ |
లాకినీ దేవి రూపములో నాభిస్థానమందున్న మణిపూర చక్రములో పది దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు మూడు ముఖములతో ఎరుపు వర్ణము కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి మాంస ధాతువు నందు శక్తి రూపమై, బెల్లముతో చేసిన అన్నము ఇష్టముగా స్వీకరించును.
డామరి మొదలైన పది మంది శక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
(డామరి, ఢంకారిణి, ణామిరి, తామసి, స్థాణ్వి, దాక్షాయిణి, ధాత్రి, నందా, పార్వతి, ఫట్కారిణి)
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా, అతిగర్వితా |
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ |
కాకినీ దేవి రూపములో ఉదర స్థానమందున్న స్వాధిష్ఠాన చక్రములో ఆరు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు నాలుగు ముఖములతో పచ్చని వర్ణము కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి మేదస్సు ధాతువు నందు శక్తి రూపమై, పెరుగుతో చేసిన అన్నము ఇష్టముగా స్వీకరించును.
బందిని మొదలైన ఆరు మంది శక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
(బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమా, లంబోష్టితా)
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,అస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా |
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
సాకినీ దేవి రూపములో మూల స్థానమందున్న మూలాధార చక్రములో నాలుగు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఐదు ముఖములతో ధూమ్ర వర్ణము కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి అస్థి (ఎముకల) ధాతువు నందు శక్తి రూపమై, పెసర
పప్పుతో కూడిన అన్నము (పులగము) ఇష్టముగా స్వీకరించును.
వరదా మొదలైన నలుగురుశక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
(వరద, శ్రీ, షండా, సరస్వతి)
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా |
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ |
ఆఙ్ఞా చక్రము
- గంగ, యమున, సరస్వతి సంగమ స్థానము
- ఇడ, పింగళ, సుషుమ్నసంగమ స్థానము
- వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి సంగమస్థానము,
- చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము సంగమ స్థానము
- చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము సంగమ స్థానము
హాకినీ దేవి రూపములో భ్రూమద్యస్థానమందున్న ఆఙ్ఞా చక్రములో రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఆరు ముఖములతో శుక్ల (తెల్లని) వర్ణము కలిగి భాసిల్లుతున్నది.
ఈ దేవి మజ్జ (ఎముకల మద్య ఉండు) ధాతువు నందు శక్తి రూపమై, పసుపుఅన్నము (పులిహోర) ఇష్టముగా స్వీకరించును.
హంసవతీ, క్షమావతి అను ఇద్దరు శక్తి దేవతలు సదా సేవిస్తూ ఉంటారు.
సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ |
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
యాకినీ దేవి రూపములో శిరః స్థానమందున్న సహస్రారములో వేయి దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు అనేక ముఖములతో అనేక వర్ణములతో భాసిల్లుతున్నది.
ఈ దేవి శుక్ల ధాతువు నందు శక్తి రూపమై, పాయసాన్నము మొదలు హరిద్రాన్నము వరకు గల అన్ని రకములైన అన్నములు ఇష్టముగా స్వీకరించును
మన దేహములో అంతర్గతమై ఉన్న షట్ చక్రముల వివరణ
చక్రము
|
స్థానము
|
తత్వము
|
లోకము
|
అధిదేవుడు
|
శక్తి దేవత
|
గుణములు
|
ఇంద్రియము
|
బీజాక్షరం
|
దళములు
|
గ్రంధి
|
ఫలితం
|
మూలాధార
|
గుద
|
పృథివి (భూ)
|
భూః
|
గణేశుడు,బ్రహ్మ
|
డాకిని
|
గంధ(వాసన)
|
నాసిక(ముక్కు)
|
లం
|
(4)వ,శ,ష,స
|
-
|
బుద్ధి,విద్య
|
స్వాధిష్టాన
|
లింగమూలము
|
ఆపః (జల)
|
భువః
|
బ్రహ్మ,నారాయణ
విష్ణు,హరుడు
|
రాకిని
|
రస (రుచి)
|
జిహ్వ(నాలుక)
|
వం
|
(6)బ,భ,మ,
య,ర,ల
|
బ్రహ్మ
|
కవిత్వం,యోగ
|
మణిపూర
|
నాభి
|
తేజస్ (అగ్ని)
|
స్వః (స్వర్గ)
|
విష్ణువు,శంకరుడు
|
లాకిని
|
రూప (దృష్టి)
|
నేత్ర(కనులు)
|
రం
|
(10)డ,ఢ,ణ,
త,థ,ద,ధ
న,ప,ఫ
|
-
|
విద్య,శక్తి
|
అనాహత
|
హృదయ
|
వాయు(గాలి)
|
మహః
|
ఈశానుడు
|
కాకిని
|
స్పర్శ
|
త్వక్ (చర్మము)
|
యం
|
(12)క,ఖ,గ,ఘ,ఙ్
చ,చ,జ,ఝ,ఞ్
ట,ఠ
|
విష్ణు
|
వివేకము,
దైవ భక్తి
|
విశుద్ధ
|
కంఠ మూలము
|
ఆకాశ
|
జనః
|
మహేశ్వరుడు
|
శాకిని
|
శబ్ధ
|
శ్రోత్రం(చెవి)
|
హం
|
(16)అ,ఆ,ఇ,ఈ
ఉ,ఊ,ఋ,ౠ
లు,లూ,ఎ,ఐ
ఓ,ఔ,అ,అః
|
-
|
వాక్కు,తెలివి
|
ఆజ్ఞా
|
భ్రూ మధ్య
|
అవ్యక్త అహంకార
|
తపః
|
సదాశివుడు
|
హాకిని
|
సంకల్ప
వికల్ప
|
మనస్సు
|
ఓం
|
(2)ళ,హ
|
రుద్ర
|
వాక్ శుద్ధి
|
సహస్రార
|
మెదడు
|
-
|
సత్య
|
పరబ్రహ్మ
|
యాకినీ దేవి రూపములో
మహాశక్తి
|
-
|
-
|
ః
|
అ నుండి క్ష
|
-
|
-
|
Very nice sir.more informative.I like your attitude.Thank you
ReplyDelete